![]() |
![]() |

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -43 లో.....రుద్ర సంరక్షణలో పెరుగుతున్న పాప గంగకి గుళ్లో పరిచయం అవుతుంది. కాసేపు ఇద్దరు మాట్లాడుకుంటారు. ఆ పాప మా సర్ చాలా మంచోడు అని గొప్పగా చెప్తుంది. నాకు మీ సర్ ని చూడాలనిపిస్తుందని గంగ అనగానే మా సర్ ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడాడని పాప చెప్తుంటే గంగకి అతను ఎవరో తెలుసుకోవాలన్న కూతుహలం పెరుగుతుంది.
ఆ తర్వాత ఆ పాప దగ్గరికి ఒకావిడ వచ్చి వెళదాం పదా సర్ చూస్తే కోప్పడతాడని చెప్తుంది. దాంతో ఆ పాప గంగకి బై చెప్పి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత గంగ దగ్గరికి పెద్దసారు వస్తాడు. ఇందాక మీరు ఒకావిడతో మాట్లాడారు.. ఎవరు ఆవిడా అని అడుగుతుంది. పెద్దసారు మాట్లాడింది గంగ వాళ్ళ అమ్మ లక్ష్మీతో కానీ ఆవిషయం గంగకి చెప్పాడు. ఎవరో తెలిసినావిడ గుళ్లో ప్రసాదం చేస్తుందట అని పెద్దసారు కవర్ చేస్తాడు. ఆ తర్వాత రుద్ర పెద్దసారుకి ఫోన్ చేసి ఎక్కడున్నారు నేను వచ్చిన పని అయిపోయింది.. నేను వెళ్తున్నాను మీరు వెళ్ళండి అని రుద్ర చెప్తాడు. ఆ గంగకి బ్రెయిన్ లేదు తలతిక్కగా ఉంటుంది.. ఎక్కువసేపు ఉండకుండా త్వరగా వెళ్ళండి అని రుద్ర అనగానే పెద్దసారు నవ్వుతాడు. ఎందుకు నవ్వుతున్నారు నన్ను తిట్టారు కదా అని గంగ అంటుంది.
మరొకవైపు వీరుకి తన మనిషి అయినా సైదులు ఫోన్ చేస్తాడు. పాప కోసం హడావిడిగా వచ్చాడు చాలాసేపు ఎవరైనా డౌట్ గా కనిపిస్తారేమోనని వెతికాడు కానీ ఎవరు కనిపించలేదని సైదులు చెప్తాడు. ఆ పాపతో మనకి చాలా పని ఉంది ఫాలో అవుతు ఉండమని వీరు చెప్తాడు. ఆ తర్వాత వీరు దగ్గరికి ఇషిక వచ్చి ఆ పాపకి హెల్ప్ చేస్తున్నాడు రుద్ర అంతే కానీ పాపతో మనకి ఏం అవసరమని ఇషిక అంటుంది. కొన్ని చిన్న విషయాలు కూడా పట్టించుకోవాలి.. అప్పుడే మనం అనుకున్నది అవుతుందని వీరు అంటాడు. ఆ గంగ ఇప్పుడు ఇంట్లో పూజ చేస్తుంది. వినాయకుడి విగ్రహం తేవడానికి వెళ్ళింది. తన మాటలతో ఇంట్లో అందరిని గ్రిప్ లో పెట్టుకుందని వీరుతో ఇషిక అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |